బిగ్ బాస్ సీక్రెట్ అజెండా అదేనా!
on Dec 3, 2022
బిగ్ బాస్ లో రోజు రోజుకి కథ మారుతూ వస్తోంది. కారణం నిన్న మొన్నటి దాకా డబుల్ ఎలిమినేషన్ అనే కథనాలు వచ్చాయి. ఇప్పుడేమో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనే వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వారం టాస్క్ లో ఎవరు బాగా పర్ఫామెన్స్ చేసారనే దానికంటే కూడా ఎవరు వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారనేది చూస్తే అది కచ్చితంగా ఫైమానే అని చెప్పాలి. ఎందుకంటే గతవారమే తను ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళాల్సింది. కానీ 'ఎవిక్షన్ ఫ్రీ' ఉండటం వల్ల తను సేవ్ అయ్యింది.
అయితే బిగ్ బాస్ సీక్రెట్ మిషన్ మొదలుపెట్టాడు. అది ఏంటంటే హౌస్ లో బాగా పర్ఫామెన్స్ చేసేవాళ్ళని సీక్రెట్ రూంకి పిలిచి మాట్లాడాడు. కాగా ఈ వారం ఓటింగ్ చూస్తే లీస్ట్ లో కీర్తి భట్, ఫైమా, ఆదిరెడ్డి ఉండగా, వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే సస్పెన్స్ ఇప్పుడు అందరిలోను ఉంది. ఓటింగ్ లో ఇనయా లేకపోవడంతో ఆ ఓట్లు అన్ని రోహిత్ కి పడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ అయితే బెస్ట్ ఓటింగ్ తో ఎప్పటిలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక చివరి స్థానంలో కీర్తి, ఫైమా ఉన్నారు. అయితే గత వారం బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈసారి కూడా ఫైమాని పక్కని పెట్టి, కీర్తి భట్ ని ఎలిమినేట్ చేస్తారేమోనని, సీక్రెట్ అజెండా అదే కావొచ్చు అని వీక్షకులు భావిస్తున్నారు.
Also Read